తెలంగాణలో గత 24 గంటల్లో 366 కొత్త కేసుల నమోదు
- రాష్ట్రంలో 80,470 కరోనా పరీక్షలు
- ఒక్క జీహెచ్ఎంసీలోనే 100కి పైగా కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,295 మందికి చికిత్స
అదే సమయంలో 345 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,098 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,45,939 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,295 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,864కి పెరిగింది.
