దుష్టశక్తితో పోరాటమే ప్రధానంగా 'శ్యామ్ సింగ రాయ్'
- రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం
- నాని సరసన ముగ్గురు కథానాయికలు
- సంగీత దర్శకుడిగా మిక్కీ జె.మేయర్
- త్వరలో విడుదల తేదీ ప్రకటన
ఈ కథ ఏ కాలానికి సంబంధించినదే అయినా, దుష్టశక్తి - దైవశక్తి మధ్య పోరాటం ప్రధానమైన అంశంగా కనిపిస్తుందని అంటున్నారు. సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో ఉండనున్నాయని అంటున్నారు.
వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. జిషు సేన్ గుప్తా - మురళీ శర్మ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, త్వరలోనే విడుదల తేదీ ప్రకటన రానుంది. తొలిసారిగా నాని టచ్ చేస్తున్న ఈ పాయింట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.