'మా' ఎన్నికల తేదీ ఖరారు.. హోరెత్తనున్న ప్రచారం
- అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు
- అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు
- అసోసియేషన్ శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా జరగనున్న ఎన్నికలు
'మా' శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఇంతకు ముందు మంచు విష్ణు మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నికలకు అందరూ అంగీకరిస్తే... తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఎన్నికల తేదీ వెలువడిన నేపథ్యంలో ప్రచారపర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థులు, వారి ప్యానల్స్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.