'బ్యాచ్ లర్' దాదాపు దసరా బరిలోకే దిగుతాడట!

Most Eligible Bachlor movie release at Dasara
  • అఖిల్ తాజా చిత్రంగా 'బ్యాచ్ లర్'
  • కరోనా కారణంగా విడుదల ఆలస్యం
  • ఓ నిర్ణయానికి వచ్చిన మేకర్స్
  • త్వరలోనే అధికారిక ప్రకటన
అఖిల్ హీరోగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రూపొందింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, బన్నీవాసు నిర్మించాడు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకు, గోపీసుందర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తిచేసుకుని చాలా రోజులే అవుతోంది.

అయితే కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలను ప్రకటించేస్తున్నాయి. అయితే అఖిల్ సినిమా నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్టుగా తెలుస్తోంది.
Go Back to Shorts
Akhil
Pooja Hegde
Eesha Rebba

More Telugu News