తెలంగాణలో కొత్తగా 389 మందికి కరోనా
- గత 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 6,276 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,45,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,276 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,862కి చేరింది. కరోనా మరణాల రేటు జాతీయస్థాయిలో 1.3 శాతం ఉండగా, తెలంగాణలో 0.58 శాతానికి దిగొచ్చింది.
