గంపమల్లయ్య స్వామి క్షేత్రంలో విషాదం.. పూజ చేస్తూ కొండపై నుంచి జారిపడి అర్చకుడి మృతి
- ఏటా శ్రావణమాసంలో గంపమల్లయ్య క్షేత్రంలో పూజలు
- కొండరాళ్ల మధ్య కొలువైన దేవుడు
- రాళ్ల మధ్యకు దిగి పూజలు చేయాల్సిన వైనం
- ప్రమాదవశాత్తు పడిపోయిన పూజారి పాపయ్య
గంపమల్లయ్య స్వామి వారికి పూజలు చేసే క్రమంలో పూజారి పాపయ్య ప్రమాదవశాత్తు కొండ పైనుంచి పడి మృతి చెందాడు. 40 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆయన బండ రాళ్లకు గుద్దుకుంటూ కిందకు పడిపోయాడు. ఈ ఘటనతో గంపమల్లయ్య స్వామి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో మీడియాలో దర్శనమిస్తోంది.