తెలంగాణలో 400కి దిగువన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 73,899 కరోనా పరీక్షలు
- 359 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 74 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,728 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,394 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,43,812 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,728 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,854కి పెరిగింది.
