తెలంగాణలో మరో 424 మందికి కరోనా పాజిటివ్

  • గత 24 గంటల్లో 91,350 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 73 కేసులు
  • తాజాగా ఇద్దరి మృతి
  • ఇంకా 6,912 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 91,350 కరోనా పరీక్షలు నిర్వహించగా, 424 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 73 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 46, రంగారెడ్డి జిల్లాలో 27, నల్గొండ జిల్లాలో 24, వరంగల్ అర్బన్ జిల్లాలో 24 కేసులు వెల్లడయ్యాయి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 449 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,53,626 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,42,865 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 6,912 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,849కి చేరింది.





More Telugu News

Corona Virus Telangana