లార్డ్స్ మైదానంలో మాటల యుద్ధంపై ఇంగ్లండ్ సారథి జో రూట్ వివరణ
- లార్డ్స్ టెస్టులో భారత్ గెలుపు
- తీవ్ర గొడవలేమీ జరగలేదని వెల్లడి
- విద్వేషం చోటుచేసుకోలేదని స్పష్టీకరణ
- షమీ, బుమ్రాలపై ప్రశంసలు
ఈ టెస్టు సందర్భంగా ఆటగాళ్ల మధ్య మరీ తీవ్రమైన గొడవలేమీ జరగలేదని, విద్వేషం ఎక్కడా చోటు చేసుకోలేదని వెల్లడించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్రణాళికతో ఆడగా, తాము వ్యూహాత్మకంగా అనేక తప్పులు చేశామని రూట్ అంగీకరించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో షమీ, బుమ్రా పట్టుదలతో బ్యాటింగ్ చేసిన తీరు మ్యాచ్ లో కీలక అంశమని పేర్కొన్నాడు.
వాస్తవానికి టీమిండియా లోయరార్డర్ ను త్వరితగతిన పెవిలియన్ చేర్చగలమని భావించానని, కానీ షమీ, బుమ్రా తమను ఆశ్చర్యానికి గురిచేశారని రూట్ వివరించాడు. వారిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం కారణంగానే తమ జట్టు కష్టాల్లో పడిందని చెప్పుకొచ్చాడు.