తెలంగాణ నీటిని ఏపీ దోచుకుపోతోంది... ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
- జలవివాదాలపై స్పందించిన బండి సంజయ్
- రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తావన
- అక్రమంగా నీటి తరలింపుకేనని ఆరోపణ
- సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించలేదని అసంతృప్తి
శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా నీటిని తరలించడానికే ఏపీ గత ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎంకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
