అమెరికా విమానానికి వేళ్లాడిన ఆఫ్ఘన్లు... గాల్లోంచి జారిపడి ముగ్గురి మృతి
- కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
- ఎయిర్ పోర్టులో బాధాకరమైన దృశ్యాలు
- దేశం విడిచి వెళ్లేందుకు ఆఫ్ఘన్ల యత్నం
- అమెరికా సైనిక విమానం వెంట పరుగులు
- ప్రమాదమని తెలిసీ సాహసం!
ఈ క్రమంలో ముగ్గురు ఆఫ్ఘన్ పౌరులు గాల్లోంచి జారిపడి మృతి చెందారు. అటు, అమెరికా బలగాల కాల్పుల్లో మరో ఐదుగురు చనిపోవడం తెలిసిందే. కాగా, ఆఫ్ఘన్లు అమెరికా సీ-17 విమానంతో పాటే పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ కలచివేస్తోంది. తాలిబన్ల పట్ల ఆఫ్ఘన్ల మనోభావాలను ఈ వీడియో ప్రతిబింబిస్తోంది.