స్పైస్ జెట్ విమానయాన సంస్థకు భారీ జరిమానా విధించిన వినియోగదారుల కమిషన్
- విమానం ఆలస్యంగా వస్తోందని టికెట్లు క్యాన్సిల్ చేయించిన సిబ్బంది
- అప్పటికప్పుడు వేరే టికెట్లు బుక్ చేయించిన వైనం
- రూ. 29,975 అదనంగా ఖర్చయ్యాయంటూ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించిన వినియోగదారుడు
అయితే, అప్పటికప్పుడు మళ్లీ టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల తమకు అదనంగా రూ. 29,975 ఖర్చయ్యాయని... స్పైస్ జెట్ సంస్థ నుంచి తమకు పరిహారం ఇప్పించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ను సూర్యనారాయణ ఆశ్రయించారు. విచారణ సందర్భంగా వినియోగదారుడి వాదనతో కమిషన్ ఏకీభవిస్తూ, స్పైస్ జెట్ కు భారీ జరిమానా విధించింది.
రూ. 29,975ను 9 శాతం వడ్డీతో వినియోగదారుడికి చెల్లించాలని... దీంతోపాటు వారు అనుభవించిన వేదనకు పరిహారంగా రూ. 20 వేలు, కేసు ఖర్చుల కింద రూ. 5 వేలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను పాటించినందుకు గాను వినియోగదారుడికి రూ. లక్ష చెల్లించాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర వినియోగదారుల సంక్షేమ నిధికి మరో లక్ష రూపాయలు చెల్లించాలని తీర్పును వెలువరించింది.