యాంకర్ గాయత్రి ఫేస్ బుక్ హ్యాక్.. అభ్యంతరకర మెసేజ్ లు పెడుతున్న దుండగులు!
- గాయత్రి ఫేస్ బుక్, పేజ్ లను హ్యాక్ చేసిన దుండగులు
- మతాలకు సంబంధించి అభ్యంతరకర మెసేజ్ లు పెడుతున్న వైనం
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయత్రి
ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ... గాయత్రి భార్గవికి ఫేస్ బుక్ ఖాతాతో పాటు, ప్రత్యేకంగా పేజీ కూడా ఉందని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ఫేస్ బుక్, పేజ్ లను హ్యాక్ చేసి... వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన మెసేజ్ లను పోస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.