Telangana: తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

Media Bulletin on status of corona cases in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 482 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 82 కేసులు నమోదుకాగా... అత్యల్పంగా జోగులాంబ గద్వాల్, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నమోదయ్యాయి. ఇదే సమయంలో 455 మంది కోలుకోగా...  ఇద్దరు మృతి చెందారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,50,835కి చేరుకుంది. మొత్తం 6,38,865 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 98.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,833 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.
 
Go Back to Shorts
Telangana
Corona Virus
Updates

More Telugu News