కరోనా వ్యాక్సినేషన్ పై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
- టీచర్లతో పాటు పాఠశాలల సిబ్బందికీ కరోనా టీకాలు
- గ్రామం యూనిట్ గా వ్యాక్సినేషన్
- 18–44 ఏళ్ల వారికీ టీకాలు
- అధికారులకు సీఎం ఆదేశాలు
ప్రజల దగ్గరకు వెళ్లే ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది అందరికీ టీకాలు వేయాలన్నారు. వ్యాక్సిన్లను ఎక్కువగా వేస్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఆరోగ్యశ్రీ కార్డులో క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేయాలన్నారు. ఆ కోడ్ ను స్కాన్ చేయగానే వారి వివరాలు వచ్చేలా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డును ఆధార్ తో అనుసంధానించాలని సూచించారు. గ్రామాల్లోని క్లినిక్ ల నుంచి బోధనాసుపత్రుల దాకా జిల్లాను యూనిట్ గా తీసుకుని నియామకాలను చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.