ఉత్కంఠకు తెర.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీకి టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
- గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఖరారు చేసిన టీఆర్ఎస్
- తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడని ప్రకటన
- ఉద్యమ కాలంలో పలు సార్లు అరెస్టయి జైలుకెళ్లారన్న టీఆర్ఎస్
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని ఆ పార్టీ ప్రకటన చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో పలు సార్లు అరెస్టయి జైలుకెళ్లారని చెప్పింది. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్ధతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని చెప్పింది.