హుజూరాబాద్ ఓటర్లకు టీఆర్ఎస్ లేఖలు.. 2 లక్షలకుపైగా ముద్రణ
- లేఖలో వివిధ పథకాల ప్రస్తావన
- ఏడేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ప్రస్తావన
- వివిధ పథకాల లబ్ధిదారులతోపాటు వారి కుటుంబ సభ్యులకు కూడా లేఖలు
గత ఏడు సంవత్సరాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విదేశీ విద్యానిధి తదితర వాటిని అందులో వివరిస్తోంది. ఈ పథకాల లబ్ధిదారులతోపాటు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకు కూడా ఈ లేఖలను పంపనుంది.
అలాగే, నియోజకవర్గంలో చేపట్టిన ఇతర అభివృద్ధి కార్యక్రమాల వివరాలను కూడా ఈ లేఖల్లో జోడిస్తున్నారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు ముందే ఈ లేఖలను నియోజకవర్గ ప్రజలకు పంపనున్నారు. ఇవన్నీ చూశాక ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని టీఆర్ఎస్ ఆ లేఖల్లో ఓటర్లను అభ్యర్థించనుంది.