ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్: షూటింగ్ ఫొటోను షేర్ చేసిన ఆర్ఆర్ఆర్ హీరోయిన్
- ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ షూటింగ్
- పాట చిత్రీకరణలో పాల్గొన్న తారక్ హీరోయిన్
- వెనక్కు తిరిగి చూస్తున్న ఫొటో పోస్ట్

తాజాగా ఉక్రెయిన్ లో జరుగుతున్న చివరి షెడ్యూల్ లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఆ షూటింగ్ లో ఒలీవియా పాల్గొంది. తారక్, ఒలీవియాల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను ఒలీవియా తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. వెళ్తూ వెళ్తూ వెనక్కు తిరిగి చూస్తున్న ఫొటోను పెట్టింది. షూటింగ్ లో మళ్లీ జాయిన్ అయినందుకు ఆనందంగా ఉందని కామెంట్ పెట్టింది.