అమరావతి రైతుల ర్యాలీకి అనుమతి నిరాకరణ.. రాజధాని పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు
- అమరావతి ఉద్యమానికి నేటితో 600 రోజులు
- హైకోర్టు నుంచి మంగళగిరి ఆలయం వరకు అమరావతి జేఏసీ ర్యాలీ
- అనుమతి నిరాకరించిన పోలీసులు
- విజయవాడ-అమరావతి మార్గంలోనూ ఆంక్షలు
ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులను పరిశీలించి స్థానికులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు. అలాగే, విజయవాడ-అమరావతి మార్గంలోనూ ఆంక్షలు అమలవుతున్నాయి. వాహనాలను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే విడిచిపెడుతున్నారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు నిరసనలకు దిగిన టీడీపీ కార్యకర్తలను తాడేపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు.