తెలంగాణలో మరో 577 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 1,11,226 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు
- అనేక జిల్లాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
అదే సమయంలో 645 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,48,388 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,35,895 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,674 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,819కి చేరింది.
