గ్రామీణ ప్రయాణికుల కోసం 'ట్రావెల్ యూనియన్' ప్లాట్ ఫాంను ఆవిష్కరించిన సోనూ సూద్
- దాతృత్వానికి కేరాఫ్ అడ్రెస్ గా సోనూ సూద్
- కరోనా వేళ విస్తృత సేవలు
- తాజాగా గ్రామీణ ప్రయాణికులపై దృష్టి
- విభిన్న ప్రయాణ సేవలు అందించేలా కొత్త వేదిక
నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ట్రావెల్ ఏజెన్సీలను ఈ ట్రావెల్ యూనియన్ వేదిక ద్వారా అనుసంధానం చేయాలన్నది దీని వెనకున్న ఆలోచన. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు అసంఘటితంగా ఉన్న విషయాన్ని గుర్తించిన సోనూ సూద్, ఆయా ట్రావెల్ ఏజెన్సీల భాగస్వామ్యంతో ఈ వేదికను తీసుకువచ్చారు.