ఏపీలో మరో 2,209 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 81,505 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 438 కేసులు
- కర్నూలు జిల్లాలో 27 కేసులు
- రాష్ట్రంలో 22 మరణాలు
అదే సమయంలో 1,896 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా, 22 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆరుగురు బలయ్యారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,490కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,78,350 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,44,267 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 20,593 మందికి చికిత్స జరుగుతోంది.