దీపావళికి బరిలోకి దిగుతున్న వరుణ్ తేజ్ 'గని'
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- 'గని' పాత్ర కోసం గట్టి కసరత్తు
- కీలక పాత్రలో సునీల్ శెట్టి
- తమన్ సంగీతం ప్రత్యేకం
ఇక ఈ సినిమాను దీపావళికి థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాక్సర్ 'గని' పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంతగా కసరత్తు చేశాడనేది ఈ పోస్టర్ ను చూస్తే అర్థమైపోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ కనువిందు చేయనుంది.
కీలకమైన పాత్రలలో సునీల్ శెట్టి .. ఉపేంద్ర కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. వరుస హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా మరింత ఊపునిస్తుందేమో చూడాలి. ఇక వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 3' సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.