డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లే గెలిచాను: టోక్యో నుంచి మీడియాతో పీవీ సింధు
- ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డా
- కాంస్య పతకం గెలవడం సంతోషంగా ఉంది
- నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్ పార్క్ ఎంతో కష్టపడ్డారు
- కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నానన్న సింధు
తాను డిఫెన్స్ మెరుగుపరుచుకోవడం వల్లే ఈ పతకం గెలుచుకున్నానని చెప్పింది. తాను గతంలో గచ్చిబౌలి స్టేడియంలో చేసిన సాధన బాగా ఉపయోగపడిందని తెలిపింది. భారత్ కు పతకం తీసుకురావడం గర్వంగా ఉందని, అయితే, సెమీస్‌లో ఓడిపోవడంతో బాధపడ్డానని చెప్పింది. ఈ ఒలింపిక్స్‌లో సాధించిన విజయాన్ని తన కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నానని తెలిపింది.