ఒక్క అవకాశం ఇవ్వండి.. తెలంగాణ, ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: రేవంత్‌రెడ్డి

TRS and BJP are same Revanth Reddy
  • టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే
  • ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏడేళ్లైనా అతీగతీ లేదు
  • ఈద్ మిలాప్ కార్యక్రమంలో రేవంత్
టీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, నోట్ల రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ సమీర్ వలీయుల్లా ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, దాసోజ్ శ్రవణ్, జావిద్, ఫిరోజ్‌ఖాన్ తదితరులతో కలిసి పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏడేళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు. అలాగే, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల హక్కుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పోరాడే కాంగ్రెస్‌కు ముస్లింలు మద్దతు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
BJP
Telangana
Eid Milap

More Telugu News