వందేళ్ల క్రితం నాటి రామప్ప దేవాలయం.. సోషల్ మీడియాలో ఫొటో చక్కర్లు!
- వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసిన వ్యక్తి
- పురాతత్వ శాఖ ఉద్యోగిగా గుర్తింపు
- 1922లో తీసిన ఫొటో అని వెల్లడి
అయితే, తాజాగా 1922 నాటిదని చెబుతున్న రామప్ప గుడి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకటాపురం (ఎం) మండలంలోని నల్లగుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూప్ లో ఆ ఫొటోను షేర్ చేశాడు. ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడు. అప్పటికే చాలా మంది దానిని ఫార్వర్డ్ చేశారు. ఆ వ్యక్తి పురాతత్వశాఖలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వందేళ్ల క్రితం 1922లో ఆ ఫొటోను తీశారని అతడు పేర్కొన్నాడు. మిగతా వివరాలేవీ చెప్పలేదు.