హైకోర్టులో దానం నాగేందర్‌కు ఊరట.. ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఉత్తర్వులు
- 2013లో నమోదైన కేసులో దానంకు ఆరు నెలల జైలు శిక్ష
- శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- బెయిలు విషయంలో కింది కోర్టు షరతులే వర్తిస్తాయన్న న్యాయస్థానం
ఈ తీర్పును నాగేందర్ హైకోర్టులో సవాలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ జి.శ్రీదేవి దానంపై విధించిన ఆరు నెలల జైలు శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. బెయిలుకు సంబంధించి కింది కోర్టు విధించిన షరతులే వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.