సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Trisha condemns news reagrding her marriage
  • త్రిష పెళ్లి వార్తలపై వివరణ 
  • 'గాడ్ ఫాదర్'గా మెగాస్టార్?
  • తేజ సినిమాలో సముద్రఖని
*  ప్రముఖ కథానాయిక త్రిష త్వరలో ఓ దర్శకుడిని వివాహం చేసుకోనుందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో త్రిష పీఆర్ బృందం స్పందించింది. ఆ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదనీ, ప్రస్తుతం త్రిష సినిమాలతో బిజీగా ఉందనీ పేర్కొన్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమా షూటింగు నిమిత్తం త్రిష పాండిచ్చేరిలో వుంది.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 12 నుంచి జరుగుతుంది. ఇక ఈ చిత్రానికి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ని ఖరారు చేసే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
*  రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ త్వరలో హీరోగా పరిచయం కానున్నాడు. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందే ఓ లవ్ స్టోరీ ద్వారా అభిరామ్ హీరోగా కెరీర్ని మొదలుపెడుతున్నాడు. ఇక ఇందులో ప్రధాన విలన్ పాత్రకు ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఎంపికైనట్టు సమాచారం.  
Go Back to Shorts
Trisha
Maniratnam
Chiranjeevi
Rana Daggubati
Teja

More Telugu News