తమిళ యంగ్ హీరో సరసన రష్మిక!

Rashmika in talks for a Tamil movie
  • తెలుగులో రెండు సినిమాలలో రష్మిక 
  • హిందీలో మరో రెండు సినిమాలు
  • శివకార్తికేయన్ సినిమాలో అవకాశం
  • 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వం
ఇటీవలి కాలంలో అగ్రస్థానానికి దూసుకొచ్చిన కథానాయికగా రష్మికను చెప్పుకోవాలి. వరుసగా హిట్లు పడడంతో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగి.. భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ తో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో కూడా నటిస్తోంది. మరోపక్క హిందీలో ఓ రెండు సినిమాలు చేస్తూ అక్కడా ఎదగడానికి ప్లాన్ వేసుకుంటోంది.

ఇదే సమయంలో ఈ చిన్నది కోలీవుడ్ మీద కూడా దృష్టి పెట్టింది. ఆమధ్య కార్తీ హీరోగా రూపొందిన 'సుల్తాన్' చిత్రంలో నటించిన రష్మిక త్వరలో మరో తమిళ సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'జాతిరత్నాలు' చిత్రంతో పేరుతెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం రష్మికను అడుగుతున్నారట. పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Go Back to Shorts
Rashmika Mandanna
Shiva Kartikeyan
Anudeep
Allu Arjun

More Telugu News