తెలంగాణలో మరో 645 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 1,23,166 కరోనా పరీక్షలు
- ఖమ్మం జిల్లాలో, జీహెచ్ఎంసీ పరిధిలో 72 చొప్పున కేసులు
- నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో నలుగురి మృతి
అదే సమయంలో 729 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,42,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,29,408 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,237 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,791కి పెరిగింది.
