టోక్యో ఒలింపిక్స్.. హాకీలో స్పెయిన్‌పై భారత్ ఘన విజయం
- స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ఘన విజయం
- తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన భారత్
- రెండు గోల్స్ చేసిన రూపీందర్ సింగ్
తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్ చేసి స్పెయిన్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేయడంతో విజయం వరించింది. భారత జట్టులో రూపీందర్‌పాల్ 15వ నిమిషంలో ఒకటి, 51వ నిమిషంలో మరో గోల్ చేశాడు. 14వ నిమిషంలో సిమ్రన్‌జీత్ సింగ్ మరో గోల్ చేశాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే.