వైరస్ ఏదైనా ఇక ఒకటే మందు.. కెనడా శాస్త్రవేత్తల కీలక ముందడుగు
- ‘డ్రగ్ బైండింగ్ పాకెట్ల’ను గుర్తించిన శాస్త్రవేత్తలు
- కాలపరీక్షకు తట్టుకుని నిలబడుతున్నట్టు గుర్తింపు
- వాటిని లక్ష్యంగా చేసుకుని ఔషధ తయారీ
పరిశోధనలో భాగంగా కరోనా బాధితుల నుంచి సేకరించిన వేల నమూనాల్లోని వైరల్ ప్రొటీన్లను విశ్లేషించిన అనంతరం వీటిని గుర్తించారు. ప్రొటీన్లలోని కొన్ని భాగాల్లోకి ఔషధాలు చేరుతుంటాయి. తద్వారా ఆ ప్రొటీన్‌ను దెబ్బతీస్తాయి. వీటినే డ్రగ్ బైండింగ్ పాకెట్లుగా పిలుస్తారు.
ఇవి ఆ తర్వాత ఉత్పరివర్తన చెందడంతో ప్రొటీన్ భాగాల్లో ఔషధాలు ఇమడలేవు. ఇలాంటి భాగాల్లో కొన్ని ప్రొటీన్ పనితీరుకు అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇవి మార్పులకు లోనుకావు. వీటిని లక్ష్యంగా చేసుకుని కరోనాలోని అన్ని వైరస్‌లకు ఒకే ఔషధాన్ని అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.