తెలంగాణలో 500కి దిగువన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు
- 494 పాజిటివ్ కేసులు నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 76 కేసులు
- రాష్ట్రంలో నలుగురి మృతి
- ఇంకా 9,405 మందికి చికిత్స
అదే సమయంలో 710 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,153 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,27,964 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,405 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 3,784కి పెరిగింది.
