కర్ణాటకలో రేపు దళిత సీఎం నియామకం వార్తలపై యడియూరప్ప స్పందన
- ఈ రోజు సాయంత్రం పార్టీ అధిష్ఠానం నుంచి సూచనలు
- ఆ సమయంలోనే మీడియాకి కూడా ఈ విషయం తెలుస్తుంది
- ఇందులో నా జోక్యం లేదు
కర్ణాటకలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారంపై కూడా యడియూరప్పను మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ... 'పార్టీ అధిష్ఠానం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో నా జోక్యం లేదు' అని వ్యాఖ్యానించారు. కాగా, రేపు యడియూరప్ప రాజీనామా చేస్తారని, కొత్త సీఎం నియామకం జరగనుందని ప్రచారం జరుగుతోంది.