ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు రద్దు
- మార్కుల కోసం కమిటీ వేసిన ఏపీ సర్కారు
- కమిటీ సిఫారసుల మేరకు మార్కుల కేటాయింపు
- వారం ముందే ఫలితాలు వెల్లడించామన్న మంత్రి సురేశ్
ఇంటర్ సెకండియర్ లో 5,08,672 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులైనట్టు మంత్రి వెల్లడించారు. ఎవరైనా ఈ ఫలితాల పట్ల సంతృప్తి చెందకపోతే, వారికి తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు ఈ నెల 31 లోపు పరీక్ష ఫలితాలు వెల్లడించాలని ఆదేశించిందని, తాము వారం రోజుల ముందే ఫలితాలు విడుదల చేశామని తెలిపారు.