అలిపిరి నుంచి తిరుమలకు బస్ డ్రైవింగ్ పేరిట యాప్... డిలీట్ చేయించిన అధికారులు
- గూగుల్ ప్లే స్టోర్ లో డ్రైవర్ యాప్
- హిందూ ధార్మిక సంఘాల ఆగ్రహం
- టీటీడీ దృష్టికి తీసుకెళ్లిన వైనం
- విచారణ చేపట్టిన టీటీడీ
- పరారీలో యాప్ నిర్వాహకుడు సురేశ్
అయితే తిరుమల బస్సులు ఈ విధంగా ప్రమాదాలకు లోనైనట్టు చూపించడం హిందూ ధార్మిక సంఘాలను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో వారు ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన టీటీడీ అధికారులు విచారణ చేపట్టగా, యాప్ ఆర్గనైజర్ సురేశ్ పరారయ్యాడు. ఈ నేపథ్యంలో, టీటీడీ అధికారులు గూగుల్ ప్లే స్టోర్ సిబ్బందికి విషయం వివరించి, యాప్ ను తొలగించేలా చర్యలు తీసుకున్నారు.