అధిష్ఠానం నిర్ణయాన్ని అనుసరించి నడుచుకుంటా: యడియూరప్ప
- ఈ నెల 25న బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది
- బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం
- 26న తన కార్యాచరణ ప్రకటిస్తానన్న సీఎం
తాను అధిష్ఠానం నిర్ణయాన్ని అనుసరించి నడుచుకుంటానని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ తాను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ నెల 26న తన కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ఈ నెల 26 నాటికి నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. కర్ణాటకలో యడియూరప్ప సర్కారుకు ఈ నెల 26తో రెండేళ్లు పూర్తవుతాయి.