హారర్ థ్రిల్లర్ గా రానున్న 'జ' .. ట్రైలర్ రిలీజ్!
- మరో దెయ్యం సినిమా
- ప్రధాన పాత్రలో హిమజ
- దర్శకుడిగా సైదిరెడ్డి పరిచయం
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
నాయిక .. ఆమె భర్త ఊరికి దూరంగా ఉన్న ఒక పెద్ద బంగ్లాలో నివాసం ఉంటారు. అర్థరాత్రివేళలో ఆమెకి చిత్రమైన.. భయానకమైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. దాంతో ఆమె ప్రవర్తనలో మార్పు వస్తుంది .. అది ఆమె భర్తకి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ఆ బంగ్లాలో అలా ఎందుకు జరుగుతోంది? అందుకు కారకులు ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడవనుంది. సుడిగాలి సుధీర్ .. గెటప్ శ్రీను .. ప్రతాప్ రాజు .. ప్రీతీ నిగమ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.