ఏపీలో మరో 2,498 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 88,149 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 481 కేసులు
- కర్నూలు జిల్లాలో 24 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 24 మరణాలు
- 23,843 మందికి కొనసాగుతున్న చికిత్స
అదే సమయంలో 2,201 మంది కరోనా ఉంచి కోలుకోగా, 24 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి నేటివరకు 13,178 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,44,222 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,07,201 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,843 మంది చికిత్స పొందుతున్నారు.