ఏపీలో 2 వేలకు దిగువన రోజువారీ కరోనా కేసులు
- గత 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు
- 1,628 మందికి కరోనా పాజిటివ్
- తూర్పుగోదావరి జిల్లాలో 291 కేసులు
- విజయనగరం జిల్లాలో 25 కేసులు
- రాష్ట్రంలో 22 మంది మృతి
అదే సమయంలో 2,744 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,154కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,41,724 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,05,000 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 23,570 మంది చికిత్స పొందుతున్నారు.