వైసీపీ ఎంపీల ఆందోళన... రాజ్యసభ రేపటికి వాయిదా
- ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా నినాదాలు
- చర్చకు పట్టుబట్టిన వైసీపీ ఎంపీలు
- చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లిన వైనం
అంతకుముందు, సభా ప్రారంభంలో చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రసంగించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రజోపయోగ అంశాల కోసం ఉపయోగించుకోవాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి సభ్యుడు మెలగాలని పిలుపునిచ్చారు.
కాగా, సభ ప్రారంభమైన తర్వాత... వైసీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి రూల్ 267 కింద రాజ్యసభ చైర్మన్ కు నోటీసు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. రాజ్యసభలో ఈరోజు నిర్వహించే అన్ని కార్యక్రమాలను రద్దు చేసి ప్రత్యేకహోదా అంశంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.