ఏపీలో కొత్తగా 2,974 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Positive cases update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,05,024 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 577 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 501, ప్రకాశం జిల్లాలో 349, కృష్ణా జిల్లాలో 311 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 3,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మంది మరణించారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,40,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,02,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 24,708 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 13,132కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Update
Bulletin
Daily Cases

More Telugu News