లంక టాపార్డర్ ను కట్టడి చేసిన టీమిండియా స్పిన్నర్లు
- కొలంబోలో భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులు
- 26 ఓవర్లలో 4 వికెట్లకు 120 రన్స్ చేసిన లంక
- కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు
అనంతరం, భానుక రాజపక్స వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. అయితే కుల్దీప్ బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధనంజయ డిసిల్వా 14 పరుగులు చేసి కృనాల్ పాండ్య బౌలింగ్ లో వెనుదిరగడంతో లంక 117 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. చరిత్ అసలంక, కెప్టెన్ దసున్ షనక క్రీజులో ఉన్నారు.