హుజూరాబాద్ నుంచి ఈటల భార్య పోటీ?.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జమున
- హుజురాబాద్ పోటీలో నేను కూడా ఉన్నా
- ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు
- నా భర్త పోటీ చేసినా, నేను పోటీ చేసినా ఒక్కటే
- ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తాం
హుజురాబాద్ పోటీలో తాను కూడా ఉన్నట్లు జమున వ్యాఖ్యానించారు. అయితే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన భర్త పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ తాను తన భర్త ఈటలను వెనకుండి నడిపించానని ఆమె తెలిపారు. అలాగే, ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని అన్నారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లం పోటీ చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో ఆమె ప్రచారం చేస్తున్నారు. రేపటి నుంచి ఈటల కూడా పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే.