ఫేస్బుక్పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫైర్.. తప్పుడు సమాచారంతో జనాన్ని చంపేస్తున్నారని ఆగ్రహం
- టీకాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
- టీకాలు వేసుకోకపోవడమే ఇప్పుడు అతిపెద్ద వ్యాధిగా మారిందన్న బైడెన్
- బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన ఫేస్బుక్
ఫేస్బుక్ ద్వారా టీకాలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందన్న ఆరోపణలను ఆ సంస్థ ప్రతినిధి డానీ లీవర్ ఖండించారు. కరోనాపై ఫేస్బుక్లో ఇచ్చిన అధికారిక సమాచారాన్ని 200 కోట్ల మంది చూశారన్నారు. టీకా కేంద్రాల వివరాలను ఒక్క అమెరికాలోనే 30.3 లక్షల మంది పరిశీలించినట్టు తెలిపారు. ఫేస్బుక్ ప్రజల ప్రాణాలను కాపాడుతుందని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మ్యుటేషన్ చెందుతోందన్న అధికారిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని వివరించింది.