ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా రోజుకు 1000 శ్రీవారి దర్శన టికెట్లు!
- శ్రీవారి భక్తులకు మరింత వెసులుబాటు
- బస్సు చార్జీలకు అదనంగా రూ. 300 చెల్లిస్తే టికెట్
- ఉదయం 11, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం
ఆర్టీసీ ద్వారా టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.