Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ ప్రజల మనోభావాలు అధిష్ఠానానికి తెలుసు: పాలడుగు వెంకటరావు

తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం ప్రకటించేందుకు అధిష్ఠానానికి టీ-కాంగ్ ఎంపీలు గడువు విధించడంపై ఆ పార్టీ నేత పాలడుగు వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోపు తెలంగాణ ప్రకటించకపోతే పార్టీ వీడుతామన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో సోనియా గాంథీకి స్పష్టత ఉందని, రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నదే సోనియా అబిమతమని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్ఠానం గౌరవిస్తుందని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలనుకోవడం వల్లే జాప్యం జరుగుతుందని పాలడుగు అన్నారు.

More Telugu News