కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై రేపు గెజిట్ నోటిఫికేషన్లు
- నదీ బోర్డుల పరిధిపై రేపు స్పష్టత
- మధ్యాహ్నం 1.30 గంటలకు గెజిట్ నోటిఫికేషన్లు
- జల వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యత
- ఏడేళ్ల అనంతరం గెజిట్ నోటిఫికేషన్లు
ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టాన్ని అనుసరించి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్వచించగలదని కేంద్ర జల్ శక్తి శాఖ తాజాగా పేర్కొంది. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్రం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని వివరిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.