రేపు మొదలుకానున్న 'ఛత్రపతి' రీమేక్ .. గెస్టుగా రాజమౌళి!
- తెలుగులో హిట్ కొట్టిన 'ఛత్రపతి'
- ప్రభాస్ క్రేజ్ ను పెంచిన చిత్రం
- బెల్లంకొండ హీరోగా హిందీ రీమేక్
- రేపు జరగనున్న పూజా కార్యక్రమాలు
తెలుగులో మాస్ యాక్షన్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'ఛత్రపతి' కథను ఎంచుకున్నాడు. ఈ సినిమా రీమేక్ తో ఆయన బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ తెల్సిన దర్శకుడిగా వినాయక్ కి కూడా మంచి పేరు ఉంది. అందువలన ఈ ప్రాజెక్టు బాధ్యతలను ఆయనకి అప్పగించారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మరింత ఫిట్ నెస్ సాధించాడు. ఇక బౌండ్ స్క్రిప్ట్ తో వినాయక్ సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.