తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 1,15,237 కరోనా పరీక్షలు
- ఖమ్మం జిల్లాలో 96 కొత్త కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 72 కేసులు
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
అదే సమయంలో 605 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం 3,743 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,33,895 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,949 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,203 మంది చికిత్స పొందుతున్నారు.
